Advertisement
తెలుగు న్యూస్

చార్లీ చాప్లిన్ లుక్ లో నభా నటేష్

మెగాస్టార్ చిరంజీవి ‘చంటబ్బాయ్’ సినిమాలో చార్లీ చాప్లిన్ అవతారంలో మెరిశారు. పలువురు హీరోలు అలాంటి లుక్ లో కనిపించారు. ఐతే, హీరోయిన్లు చాప్లిన్ వేషంలో ఫోటోషూట్ చెయ్యరు. ఎక్కువగా మార్లిన్ మన్రోని అనుకరిస్తారనేది అందరికీ తెలిసిందే. కానీ యువ హీరోయిన్ నభా రొటీనుకి భిన్నంగా వెళ్ళింది.

ఎక్కువగా గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా భిన్నమైన ఫోటో షూట్ చేసింది. చార్లీ చాప్లిన్ అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇటీవలే ఈ భామ ‘మాస్ట్రో’ సినిమాలో నటించింది. మరిన్ని అవకాశాల కోసం చూస్తోంది. ఎక్కువగా అందచందాలు ఆరబోసి ఫాలోవర్స్ కి కనువిందు. చేస్తుంది. అలా సోషల్ మీడియాలో పాపులర్ అయింది.

Advertisement

This post was last modified on September 30, 2021 5:23 pm

Advertisement
Share