Advertisement
తెలుగు న్యూస్

ప్ర‌పంచ వ్యాప్తంగా ‘న‌వ‌ర‌స‌’ సెల‌బ్రేష‌న్స్


నెట్‌ఫ్లిక్స్ అంథాల‌జీ ఫిల్మ్ ‘న‌వ‌ర‌స‌’పై ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేమ‌ను కురిపిస్తూ ఆద‌ర‌ణ‌ను చూపిస్తున్న అభిమానులు.

Advertisement

ప్ర‌ముఖ డిజిట‌ల్ మాధ్య‌మం నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా విడుద‌లైన అంథాల‌జీ చిత్రం ‘న‌వ‌ర‌స‌’పై మ‌న ఇండియాలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మంతా ఏక‌తాటిపై రావ‌డంపై అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇండియా, సింగ‌పూర్‌, మ‌లేషియా, యుఏఈ స‌హా ప‌ది దేశాల్లో.. నెట్‌ఫ్లిక్స్‌కు సంబంధించి టాప్‌టెన్ రేసులో ‘న‌వ‌ర‌స‌’ అంథాల‌జీ చిత్రం నిలిచింది.

ఇండియ‌న్ సినిమాల్లో ఏస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గ‌జం మ‌ణిర‌త్నం, సీనియ‌ర్ ఫిల్మ్ మేక‌ర్ జ‌యేంద్ర‌న్ పంచ‌ప‌కేశ‌న్ ఆధ్వ‌ర్యంలో తొమ్మిది భావోద్వేగాలైన.. కోపం, కరుణ, ధైర్యం, అసహ్యత, భయం, నవ్వు, ప్రేమ, శాంతి మరియు అద్భుతం ఆధారంగా ‘న‌వ‌ర‌స‌’ను రూపొందించారు. ఇండియ‌న్ ఎంట‌ర్‌టైన్మెంట్‌లో లార్జ‌ర్ దేన్ లైఫ్ సాంస్కృతిక క్ష‌ణాల‌ను పొందుప‌ర‌చ‌డానికి న‌వ‌ర‌స అంథాల‌జీ కోసం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మంతా క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసింది.

ఈ గ్లోబ‌ల్ స‌క్సెస్‌ను అందించ‌డంలో త‌మ ప్రేమ‌, స‌హ‌కారాన్ని అందించిన వారిని ఉద్దేశించి మ‌ణిర‌త్నం, జ‌యేంద్ర పంచ‌ప‌కేశ‌న్ మాట్లాడుతూ ‘‘ఒక మన దేశంలోనే కాదు సింగ‌పూర్‌, మ‌లేషియ‌, యూఏఈ వంటి దేశాల్లో నెట్‌ఫ్లిక్స్లో టాప్ టెన్‌గా నిలిచిన ‘న‌వ‌ర‌స‌’కు వ‌చ్చిన స్పంద‌న చూసి మా మ‌న‌సులు ఆనందంతో నిండిపోయాయి. ఈ అంథాల‌జీని వీక్షించిన వారిలో 40 శాతం మంది బ‌య‌ట దేశానికి చెందిన ప్రేక్ష‌కులే కావ‌డం విశేషం. ఇది ప్రేక్ష‌కులకు అంత గొప్ప‌గా క‌నెక్ట్ అయ్యింద‌ని భావిస్తున్నాం. ‘న‌వ‌ర‌స‌’ రూప‌క‌ల్ప‌న‌లో చాలా మంది హృద‌య పూర్వ‌కంగా త‌మ స‌హ‌కారాన్ని అందించారు. నెట్‌ఫ్లిక్స్ వారి స‌హ‌కారంతో ప‌లువురి జీవితాల‌పై ప్ర‌భావం చూపిన ప‌లువురి గొప్ప ప్ర‌య‌తాన్ని గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకుంటుంన్నాం. వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు’’

నెట్‌ఫ్లిక్స్ గురించి..

డిజిట‌ల్ రంగంలో వ‌రల్డ్ నెంబ‌ర్ వ‌న్‌గా రాణిస్తోన్న నెట్‌ఫ్లిక్స్‌కు 208 మిలియ‌న్స్ మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. 190 దేశాల‌కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు.. ఇలా డిఫ‌రెంట్ జోన‌ర్స్ కంటెంట్‌తో ప‌లు భాష‌ల్లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది నెట్‌ఫ్లిక్స్‌. వీక్ష‌కులు(స‌బ్‌స్క్రైబ‌ర్స్‌) ఎక్క‌డ నుంచి, ఎంత వ‌ర‌కు అయినా, ఎలాంటి ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌లో అయినా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. స‌భ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడ‌టం, కావాలంటే వారు చూస్తున్న షోను కావాల్సినంత సేపు ఆపుకోవ‌డం మ‌ళ్లీ కావాలంటే ఆపేసిన చోట నుంచే వీక్షించవ‌చ్చు. ఇలా చేసే స‌మ‌యంలో ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌, డిస్ట్రెబ‌న్స్ ఉండ‌వు. నెట్‌ఫ్లిక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు సంబంధించి లేటెస్ట్ న్యూస్‌, అప్‌డేట్స్ IG@Netflix_IN, TW@Netflixindia TW South@Netflix_INSouth and FB@NetflixIndiaల‌ను ఫాలోకండి.

(PRESS RELEASE)

Advertisement

This post was last modified on August 18, 2021 12:22 pm

Advertisement
Share