Advertisement
తెలుగు న్యూస్

పెళ్లి చేసుకోను…గోక్కుంటా: నవదీప్


నవదీప్ కి ఏజ్ బార్ ఐపోతోంది. అదేనండి… పెళ్లి వయసు దాటిపోతోంది. హీరోగా అడుగుపెట్టి ఇప్పటికే 17 ఏళ్ళు అయింది. గడ్డం తెల్లబడింది. జుట్టు ఊడిపోతోంది. ఇంకా పెళ్లి చేసుకోవా అంటూ కామెంట్ చేశారు అతని ఫాలోవర్స్.

దాంతో, వారికి సమాధానంగా ఒక వీడియో పెట్టాడు. అది బాగా వైరల్ అయింది. “దురద వస్తే గోక్కుంటాం. కానీ తోలు పీక్కోము కదా. అలాగే జుట్టు తెల్లబడుతోంది అని పెళ్లి చేసుకోమనొద్దు,” అంటూ తనని పెళ్లి గురించి అడుగుతున్న వారికి ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

నవదీప్ గురించి అనేక రూమర్లు ఉన్నాయి. రీసెంట్ గా ఒక యాంకర్ తో రిలేషన్ లో ఉన్నాడన్న మాట వినిపిస్తోంది. కారణం ఏదైనా …. నవదీప్ కూడా సల్మాన్ ఖాన్, ప్రభాస్ లా పెళ్లిని వాయిదా వేస్తూనే ఉంటాడా? లేదా బ్రహ్మచారిగానే ఉండిపోతాడా అనేది చూడాలి.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నవదీప్ తన ఫాలోవర్స్ కి ఇచ్చే రిప్లైస్ కూడా వైరల్ అవుతుంటాయి.

Advertisement

This post was last modified on January 23, 2022 10:43 pm

Advertisement
Share