Advertisement
తెలుగు న్యూస్

నిర్మాత వల్లే నిఖిల్ కి బాధ

‘స్పై’ సినిమా విడుదల విషయంలో నిర్మాత రాజశేఖర్ రెడ్డికి, హీరో నిఖిల్ కి చిన్నపాటి గొడవ వచ్చింది. ఈ సినిమాకి జూన్ 29 సరైన విడుదల తేదీ కాదు అని నిఖిల్ వాదించాడు. ఇంకా సినిమా ఔట్పుట్ సరిగా చేసుకొని ఆగస్టులో విడుదల చేద్దాం అని నిఖిల్ పట్టుబట్టాడు. కానీ నిర్మాత అంగీకరించలేదు.

నిర్మాతకి మంచి బిజినెస్ జరిగింది. కోట్లలో టేబిల్ ప్రాఫిట్ వచ్చింది. దాంతో, అతను సినిమాని వాయిదా వేసేందుకు కానీ, మరింతగా మెరుగుపర్చేందుకు ఒప్పుకోలేదట. చెప్పిన డేట్ కి విడుదల చేస్తేనే తనకు లాభం వస్తుందని, వాయిదా వేస్తే ఓటిటి సంస్థలు రేట్ లో కోత వేస్తాయి అని హడావిడిగా విడుదల చేశారు.

ఇప్పుడు ఫలితం నిఖిల్ ఊహించినట్లే జరిగింది. తెలుగులో ఫ్లాప్ అయింది. హిందీలో సరిగా ఓపెనింగ్ రాలేదు. ఇతర భాషల్లో సరిగా రిలీజ్ కాలేదు. ఇక ఓవర్ సీస్ లో కూడా ప్రీమియర్ షో రోజే హడావుడి. ఆ తర్వాత ఏమి లేదు.

నిర్మాత మొండితనం వల్లే ఇదంతా అని నిఖిల్ బాధపడుతున్నాడట. ఇంకో నెల ఆగి ఉంటే, ఎంతో కొంత కరెక్షన్ చేసి ఉంటే హిట్ కాకపోయినా యావరేజ్ గానైనా నిలబడేది అని అనుకుంటున్నాడట. అందుకే, ఇక తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

Advertisement

This post was last modified on July 3, 2023 6:46 pm

Advertisement
Share