కొత్త ఏడాది సంబరాల కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు తదితర పెద్ద హీరోలు తమ భార్యాపిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లారు. వారం పాటు హాయిగా విదేశాల్లో గడిపిన వీళ్లంతా ఇప్పుడు హైదరాబాద్ వచ్చేస్తున్నారు.
ఎన్టీఆర్, అల్లు అర్జున్ సోమవారమే (జనవరి 1) హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. విజయ్ దేవరకొండ మరో రెండు రోజుల్లో రానున్నాడు. మహేష్ బాబు జనవరి 4న, కానీ 5న కానీ వచ్చే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ ఈ వారంలోనే “పుష్ప 2” షూటింగ్ మొదలు పెడుతాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఇక ఇప్పటి నుంచి వేగం పెంచుతారట.
మరోవైపు, ఎన్టీఆర్ ఆయన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లి వచ్చారు. ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ లో జనవరి 5 నుంచి పాల్గొంటారు. ఒక నెల రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా మన టాలీవుడ్ పెద్ద హీరోలు ఏడాదికి మూడు, నాలుగు సార్లు ఫారిన్ వెకేషన్ కి వెళ్తున్నారు. ప్రతి డిసెంబర్ 31కి విదేశాల్లోనే ఉండడం అనేది కామన్ అయిపొయింది.
The success of the "Dhurandhar" franchise has put director Aditya Dhar in the top league…
Alia Bhatt has taken on yet another action-oriented role. Although her recent female-centric action drama…
SS Rajamouli has purchased the first ticket of "Sing Geetham", a musical fantasy directed by…
Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party chief Pawan Kalyan recently appeared on…
On the occasion of Nandamuri Balakrishna's birthday, the makers of "NBK111" unveiled a special glimpse…
There has been a lot of speculation surrounding the release date of Nani starrer “The…