చిరంజీవి నుంచి వచ్చేవి ఆ రెండే!

వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నారు చిరంజీవి. అదే ఊపులో సినిమాల్ని సెట్స్ పైకి కూడా తీసుకొస్తున్నారు. ఒక్కో సినిమాను చకచకా పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి సినిమాలపై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. వచ్చే ఏడాది చిరంజీవి నుంచి ఏకంగా 3 సినిమాలు రాబోతున్నాయనేది ఆ డిస్కషన్ సారాంశం.

చిరంజీవి హీరోగా నటించిన “ఆచార్య” సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలోకి వస్తోంది. అదే ఏడాది “గాడ్ ఫాదర్” సినిమా కూడా వస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా తాజాగా చిరంజీవి కొబ్బరికాయ కొట్టిన “భోళాశంకర్” సినిమా కూడా 2022లోనే రిలీజ్ అవుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

ప్రారంభోత్సవం రోజున దర్శకుడు మెహర్ రమేష్ తమ సినిమా కూడా వచ్చే ఏడాది వస్తుందని ప్రకటించడమే దీనికి కారణం.

అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. చిరంజీవి నుంచి 2022లో వచ్చేవి 2 సినిమాలు మాత్రమే. ఎందుకుంటే, చిరంజీవి కేవలం సినిమాలు మాత్రమే చేయడం లేదు. ఆయన ఇతర వ్యవహారాలతో కూడా చాలా బిజీగా ఉన్నారు. దీనికితోడు తొందరగా ఆయన సినిమాలు పూర్తిచేయాలనుకోవడం లేదు. ఇవన్నీ పక్కనపెడితే.. ఒకే ఏడాది చిరంజీవి నటించిన 3 సినిమాలకు రిలీజ్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయడమంటే, మిగతా హీరోల సినిమాలకు అది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి వచ్చే ఏడాది నుంచి మెగాస్టార్ నుంచి “ఆచార్య, “గాడ్ ఫాదర్” మాత్రమే థియేటర్లలోకి రాబోతున్నాయి.

“భోళాశంకర్” సినిమాని 2023 సంక్రాంతికి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది.

TeluguCinema

TeluguCinema

  • Video

Video: Krithi Shetty makes a stylish appearance at film launch

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Krithi Shetty is set…

13 minutes
  • Video

Video: Keerthy Suresh shines bright in Yellow saree

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Keerthy Suresh turned heads…

33 minutes
  • News

Deewana postponed by a day, premieres pushed

"Deewana," a youthful film among this weekend releases, has been postponed by a day. The…

1 hour
  • News

Venkatesh, Kalyan Ram, Keerthy Suresh, Krithi Shetty multi-starrer launched

A unique combination has come together for the first time in director Anil Ravipudi's next…

2 hours
  • Box Office

Maa Inti Bangaram heads for a big opening in North America

"Maa Inti Bangaram," starring Samantha, is set for a strong opening in North America. Marking…

2 hours
  • Uncategorized

Dragon: Intro song to be filmed on NTR in Sri Lanka

NTR and director Prashanth Neel have joined forces for the high-budget action spectacle "Dragon." After…

3 hours