Advertisement
తెలుగు న్యూస్

ఒటిటి కోసం క్యూలో ఇవి కూడా!


నాని నటించిన ‘టక్ జగదీష్’, నితిన్ నటించిన ‘మాస్ట్రో’, వెంకటేష్ మూవీ ‘దృశ్యం 2’ సినిమాలు థియేటర్లో విడుదల కాబోవడం లేదు. ఈ మూడు సినిమాలు ఓటిటి కంపెనీలకు అమ్ముడుపోయాయి. ‘మాస్ట్రో’ త్వరలోనే హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ‘దృశ్యం 2’ (హాట్ స్టార్), ‘టక్ జగదీష్’ … సెప్టెంబర్ లో స్ట్రీమ్ అవుతాయి.

ఇక ఇదే బాటలో గోపీచంద్ నటించిన ‘సీటిమార్’, శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’, శర్వానంద్ నటిస్తున్న ‘మహా సముద్రం’ కూడా ఓటిటి కంపెనీలతో చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. త్వరలోనే వీటి విషయంలో కూడా క్లారిటీ రానుంది.

థియేటర్ల కోసం తమ గుండె కొట్టుకొంటోంది అని రాజకీయనాయకుల్లా స్పీచులు ఇచ్చిన స్టార్స్ కూడా గప్ చుప్ గా ఓటిటికి సినిమాలు అమ్మేసినప్పుడు మిగతా వారు ఇందుకు సైలెంట్ గా ఉంటారు? చిన్న, మధ్యస్థ చిత్రాలన్నీ ఓటిటి బాట పట్టేలా ఉన్నాయి. దానికి కారణం ప్రస్తుతం థియేటర్ల వ్యాపారం అనుకూలంగా లేదు.

ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీ, తక్కువ టికెట్ రేట్ల అనేది సమస్యగా మారింది. తెలంగాణాలో హైదరాబాద్ లో మినహా మిగతా చోట్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఉత్సహం చూపడం లేదు. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడమే మెయిన్ రీజన్.

అందుకే, ఓటిటిల్లో డైరెక్ట్ గా విడుదలయ్యేందుకు ఈ సినిమాలు క్యూలో నిల్చున్నాయి.

Advertisement

This post was last modified on August 5, 2021 10:58 pm

Advertisement
Share