Advertisement
తెలుగు న్యూస్

మల్లయోధులకు పవన్ సన్మానం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలో నటించిన మల్లయోధుల్ని సన్మానించారు. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటించటం కోసం ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి 16 మంది మల్లయోధులు వచ్చారు. ఇది మొఘల్ రాజుల కాలం నాటి కథ. అందుకే, ప్రాచీన మల్లయుద్ధంలో పేరుగాంచిన వీళ్లందరికి పవన్ కళ్యాణ్ సన్మానం చేశారు. శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు.

“కోడి రామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్ బాక్సింగ్, కరాటే, ఇండోనేషియా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందాను,” అని చెప్పారు పవన్ కళ్యాణ్.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సంక్రాంతి 2022 కానుకగా విడుదల కానుంది.

Advertisement

This post was last modified on March 1, 2021 12:27 pm

Advertisement
Share