Advertisement
తెలుగు న్యూస్

తన సంపాదనపై జనసేనాని కామెంట్

సినిమాల్లో సంపాదన అందరూ అనుకునేంత రేంజులో ఉండదు అని అంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. “సినిమా వాళ్ళు బాగా సంపాదిస్తారు అని అనుకుంటారు. బయట జనం మాకు ఇచ్చే కలర్ కి, మాకు ఇక్కడ వచ్చేదానికి పొంతన ఉండదు,” అని తన సంపాదన గురించి కామెంట్ చేశారు.

“సినిమా వాళ్ళ కన్నా వ్యాపార రంగంగలోనే ఆదాయం ఎక్కువ. మన దేశంలో వ్యాపారవేత్తలు, రాజకీయనేతలదే అధిక సంపాదన. ఆ రేంజులో సినిమా వాళ్లకు ఉండదు. కానీ సినిమా వాళ్ళకు ఆ ఇమేజ్ ఎక్కువ,” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

“ఒక ఉదాహరణ చెప్తా… అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి ముందే లీక్ అయింది. డిస్ట్రిబ్యూటర్లు వెనుకంజ వేశారు. ఆ టైంలో నేను చెక్ లపై సంతకాలు చేసి, షూరిటీ ఇచ్చి… రిలీజ్ చేశాం… సినిమాకి వచ్చిన పేరు, రికార్డుల మోతకు, మాకు మిగిలిన దానికి అస్సలు పొంతన లేదు. ఆ సినిమాతో మేము కోట్లు కోట్లు సంపాదించామని మీడియాలో వార్తలో మాత్రం వచ్చాయి,” అలా సినిమా వాళ్ల సంపాదన ఉంటుంది అన్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్.

Advertisement

This post was last modified on October 22, 2020 10:46 pm

Advertisement
Share