Advertisement
తెలుగు న్యూస్

ప్రగ్య డిమాండ్ ఇదే!


ప్రగ్య జైస్వాల్ నటించిన ‘అఖండ’ భారీ విజయం సాధించింది. ఈ సినిమా రిలీజయి రెండు నెలలు కావొస్తోంది. అయినా… ప్రగ్య జైస్వాల్ ఇంకో సినిమా సైన్ చెయ్యలేదు. సాధారణంగా ఒక హిట్ పడితే చాలు హీరోయిన్ల ఫేట్ మారిపోతుంది. కానీ ప్రగ్య విషయంలో మేటర్ వేరు.

ఆమె కోటి రూపాయలపైనే డిమాండ్ చేస్తోందట. ‘అఖండ’లాంటి భారీ విజయం వచ్చాక కూడా తాను ఎందుకు కోటి రూపాయల పారితోషికం తీసుకోవద్దు అనేది ఆమె ప్రశ్న. అందుకే, ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. వన్ క్రోర్ ప్లస్ అనే డిమాండ్ మీదే ఉంది.

ఈ రీజన్ వల్లే ఆమె నుంచి ఇంకో ప్రకటన రాలేదు. మరి, ఆమె డిమాండ్లకు ఓకే చెప్పే నిర్మాతలు, దర్శకులు ఎవరో? అలాంటివారు వచ్చేవరకు ఆమె ఖాళీగానే ఉంటుంది.

ఇప్పటికే ఆమె ఇండస్ట్రీలో పదేళ్లుగా ఉంటోంది. కానీ, ఈ పదేళ్లలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చుకోవాలని అనుకుంటోంది.

Advertisement

This post was last modified on January 23, 2022 2:24 pm

Advertisement
Share