Advertisement
తెలుగు న్యూస్

ప్రకాష్ రాజ్ డిన్నర్ పాలిటిక్స్, బండ్ల ఫైర్!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వేడి ముమ్మరమైంది. ప్రచారం ఊపందుకొంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అధ్యక్షుడిగా పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ మా సభ్యులకు విందు ఇస్తున్నారు.

“మన సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం, ఏమేమి చేయాలో చర్చించుకుందాం రండి” అని ప్రకాష్ రాజ్ మా సభ్యులను రమ్మంటున్నారు. ఆయన ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశారట. దాంతో, ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్.

మొన్నటివరకు ప్రకాష్ రాజ్ వైపు ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. డిన్నర్ పాలిటిక్స్ ఎందుకు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

కరోనా టైంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు అంటూ బండ్ల అడుగుతున్నారు. వాళ్ల జీవితాలతో చెలగాటాలాడొద్దు.. ఇదే నా విన్నపం అని బండ్ల ఒక వీడియో రిలీజ్ చేశారు. ఫోన్ లో కూడా ప్రతి సభ్యుడిని పలకరించొచ్చు కదా అనేది బండ్ల మాట.

Advertisement

This post was last modified on September 12, 2021 3:49 pm

Advertisement
Share