Advertisement

ఈ 3 నెలల టైమ్ లో ఎవ్వర్నీ పెద్దగా మిస్ అవ్వలేదంటోంది శృతిహాసన్. తనకు కావాల్సిన వ్యక్తులందరితో టచ్ లో ఉన్నానని చెబుతోంది. ఇక డేటింగ్ యాప్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు అలాంటివేవీ డౌన్ లోడ్ చేయలేదని చెబుతోంది. వీటితో పాటు మరికొన్ని..

– లాస్ట్ కాల్ ఎవరికి చేశారు?
నా ఫ్రెండ్ బ్రయిన్ కు చేశాను. అతడు తన జీవితంలో ఓ కొత్త వెంచర్ ప్రారంభించాడు.

– కరోనా తగ్గాక పార్టీలకు వెళ్తారా?
కచ్చితంగా ఇంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తాను. ఎక్కువగా పార్టీలకు వెళ్లను. కరోనా తర్వాత ప్రపంచమంతా ఓపెన్ అయినా నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం. నాతో నేను ఉండడమే ఇష్టం.

– లాక్ డౌన్ లో కొత్త వంటకం?
బనానా బ్రెడ్ ట్రై చేశాను.. సరిగ్గా రాలేదు

– కాలింగ్, మెసేజింగ్ లో ఏదిష్టం?
ఎక్కువగా కాల్ చేయడానికే ఇష్టపడతాను. మరీ మూడ్ లేకపోతే మెసేజ్ చేస్తా. మన మాటలతో అంతగా ప్రభావం చూపించలేనప్పుడు కొన్ని సందర్భాల్లో మెసేజ్ చేస్తుంటాను. కాలింగ్ మిస్ అయితే వాయిస్ నోట్ పెడుతుంటాను.

Advertisement

This post was last modified on August 8, 2020 8:55 am

Advertisement
Share