Advertisement
తెలుగు న్యూస్

అది అలా మిస్ అయింది: రాశి

రాశి ఖన్నా హీరోయిన్ గా మారకముందు ఒక మోడల్. జర్నలిజం చదివి మోడలింగ్ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కుంటూ ముంబై వెళ్ళింది ఈ ఢిల్లీ భామ. అలా ‘మద్రాస్ కేఫ్’ చిత్రంలో మొదటి అవకాశం వచ్చింది. ఇక రాజమౌళి తన కొత్త చిత్రం కోసం హీరోయిన్ ని చూస్తున్నారు అన్న విషయం తెలుగుసుకొని హైదరాబాద్ విచ్చేసింది. రాజమౌళి నిర్వహించిన ఆడిషన్ కి అటెండ్ అయింది.

కానీ, రాజమౌళికి ఆమె నచ్చలేదు. తన అనుకున్న పాత్రకు ఈ బబ్లీ బ్యూటీ సరిపోదు అని రాజమౌళి భావించారు. ఐతే, తన మిత్రుడు సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ‘ఊహలు గుస గుసలాడే’లో అవకాశం ప్రయత్నించు అని సలహా ఇచ్చారట రాజమౌళి. ఆ తర్వాత రాజమౌళి తమన్నాని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా పేరు… బాహుబలి.

అలా, తనకు ‘బాహుబలి’లో అవకాశం మిస్ అయింది అని చెప్పింది రాశి. తమన్న పాత్ర దక్కి ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చేది అనుకుంటోంది.

ఈ 32 ఏళ్ల సుందరి ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. తెలుగులో ఆమె జోరు తగ్గింది ఇప్పుడు.

Advertisement

This post was last modified on March 8, 2023 11:17 pm

Advertisement
Share