Advertisement
తెలుగు న్యూస్

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ కొత్త చిత్రం

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

“డియర్ మేఘ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పనిచేశాను. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఇది మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కాబట్టి చాలా స్పెషల్ గా భావిస్తున్నా,” అన్నారు మేఘ.

హీరో రాహుల్ విజయ్: ” కాన్సెప్ట్ మూవీ ఇది. కూల్ గా ఉంటుంది.”

Advertisement

This post was last modified on March 22, 2022 4:31 pm

Advertisement
Share