Advertisement
తెలుగు న్యూస్

పుకార్లు తెరదించిన రజినీకాంత్


సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రం ఆగిపోయింది అని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. ఆ పుకార్లకు తెరదించుతూ రజినీకాంత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తన తదుపరి చిత్రం కోసం ఇటీవల చేసిన ఫోటోషూట్ ఫోటోని తన సోషల్ మీడియాలో కవర్ ఫోటోగా పెట్టుకున్నారు. అది చాలు… ఆ సినిమా ఆగిపోలేదు అని చెప్పడానికి.

ఇటీవల విడుదలైంది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఈ సినిమాని తీసిన నీల్సన్ దిలీప్ కుమారే రజినీకాంత్ తదుపరి చిత్రానికి దర్శకుడు. ‘బీస్ట్’ ఫలితం చూశాక రజినీకాంత్ మనసు మార్చుకున్నట్లు ప్రచారం మొదలు పెట్టారు.

కానీ, అది నిజం కాదని ప్రూవ్ అయింది.

ఐతే, దర్శకుడు నీల్సన్ పై మాత్రం చాలా ఒత్తిడి ఉంది. విజయ్ తోనే సరిగా సినిమా తీయలేకపోయాడు. ఇక రజినీకాంత్ ఇమేజ్ ని హ్యాండిల్ చెయ్యడం అంత సులువు కాదు. సో.. మరి ఇప్పుడు ఈ బీస్ట్ డైరెక్టర్ మళ్ళీ జనాలని రోస్ట్ చెయ్యకుండా బెస్ట్ మూవీ తీయాలి.

Advertisement

This post was last modified on April 21, 2022 6:43 pm

Advertisement
Share