Advertisement
తెలుగు న్యూస్

రాజమౌళితో వర్క్ చేస్తే పేరు రాదు!

“సింహాద్రి”, “ఛత్రపతి”, “మగధీర”, “బాహుబలి”….. రాజమౌళి ముద్ర చూపిన సినిమాలు. రాజమౌళి సినిమాలు అనగానే గ్రాఫిక్స్ గుర్తొస్తాయి. కానీ రాజమౌళి అసలైన మార్క్ ఎమోషన్ తో కూడిన ఫైట్స్. ఆయన సినిమాల్లో యాక్షన్ కళ్ళు చెదిరేలా ఉంటుంది. తన సినిమాల్లో సగం ఫైట్స్ రాజమౌళి స్వయంగా కంపోజ్ చేసుకుంటారు. రామ్-లక్ష్మణ్ వంటి స్టంట్ డైరెక్టర్లకు పని తక్కువ ఉంటుంది. అందుకే రాజమౌళి సినిమాల్లో పనిచేసేందుకు ఫైట్ మాస్టర్లు అంతగా ఆసక్తి చూపరు.

రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” సినిమా నుంచి ఇటీవల తప్పుకున్నారు. ఒక ఫైట్ సగ భాగం తీసిన తర్వాత వాళ్లు ఆ సినిమా చెయ్యకుండా మిగతా సినిమాలని టేకప్ చేశారు.

“మీరు విన్నది నిజమే. మేం రామ్ చరణ్ పై ఒక ఫైట్ తీశాం. కానీ ఆ ఫైట్ తీస్తున్నప్పుడు చరణ్ కి గాయం అయింది. ఆ తర్వాత షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. తర్వాత కరోనా వల్ల సినిమా ఆగింది. దాంతో మేం వేరే సినిమాలతో బిజీ అయ్యాము. అయినా… రాజమౌళి సినిమాలకు ఎంత గొప్ప ఫైట్స్ కంపోజ్ చేసినా పేరు రాదు. క్రెడిట్ అంతా రాజమౌళికి పోతుంది,” అని అసలు విషయం చెప్పారు రామ్ లక్ష్మణ్.

అలాగని, రాజమౌళిని వారు నిందించడం లేదు. “ఆయన గొప్ప విజనరీ. ఆయన ఫైట్స్ ఆయన కంపోజ్ చేసుకోగలరు. ఆ విజన్ ఉంది. మాలాంటి వారి అవసరం పెద్దగా ఉండదు అనే చెప్పడమే మా ఉద్దేశం,” అని వారు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

This post was last modified on July 9, 2021 12:46 pm

Advertisement
Share