Advertisement
తెలుగు న్యూస్

రానా, మిహికా కర్వా చౌత్

కర్వా చౌత్.. ఈ పేరు దక్షిణాది ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. నార్త్ లో ఇది పాపులర్ పండగ.  భర్తల కోసం భార్యలు చేసే వ్రతం ఇది.

రానా కోసం మిహికా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంది. సంప్రదాయబద్ధంగా భార్యభర్తలిద్దరూ ఈ పండగను జరుపుకున్నారు. మిహికా తల్లి.. తన కూతురు-అల్లుడు కర్వాచౌత్ ను సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని చెబుతూ ఓ ఫొటో పోస్టు చేశారు.

నిజానికి రానా ఫ్యామిలీలో కర్వా చౌత్ సంప్రదాయం లేదు. కాకపోతే మిహికా బజాజ్ కు ఉత్తరాది మూలాలున్నాయి. అందుకే వాళ్లు తమ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

Advertisement

This post was last modified on November 5, 2020 4:12 pm

Advertisement
Share