రష్మిక హీరోయిన్ గా బిజీ బిజీగా మారింది. ‘పుష్ప’ ఆమెకి బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చింది. ప్రస్తుతం ఆమె ‘యానిమల్’ షూటింగ్ తో హంగామా చేస్తోంది.
‘యానిమల్’ చిత్రంలో హీరో రణబీర్ కపూర్. ఈ సినిమాకి దర్శకుడు మన తెలుగువాడైన సందీప్ రెడ్డి వంగా. ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ వాయిదా పడింది. రెండో భాగాన్ని మరింత గ్రాండ్ గా తీయాలనే ఉద్దేశంతో దర్శకుడు సుకుమార్ అమెరికా వెళ్లారు. తిరిగి ఆయన వచ్చి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసరికి మరో నాలుగు నెలల టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ‘యానిమల్’ షూటింగ్ దాదాపుగా పూర్తి చెయ్యాలనుకుంటోంది రష్మిక.
ఈ హిందీ సినిమాతో పాటు తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం కూడా ఒప్పుకొంది. ఇందులో విజయ్ హీరో. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం ఈ భామ ఫోకస్ ఈ రెండు చిత్రాలపైనే.
ఇటీవలే ఈ భామ తన పారితోషికాన్ని పెంచింది. ఈ రెండూ కూడా హిట్ ఐతే ఈ బ్యూటీ పూజ హెగ్డేని దాటేస్తుంది. అప్పుడు నంబర్ వన్ తారగా నిలబడుతుంది.
Actor and filmmaker Raghava Lawrence has sparked fresh speculation about his future plans after announcing…
Veteran filmmaker Singeetam Srinivasa Rao has directed “Sing Geetham” at the age of 94, and…
With the announcement of the release date for Ravi Teja’s “Irumudi,” one thing has become…
The confusion surrounding the release plans of Ravi Teja’s upcoming film “Irumudi” has finally come…
Taapsee Pannu has opened up about why she significantly reduced her activity on social media…
Ram Charan’s “Peddi” may have received mixed reviews and sparked controversy over Janhvi Kapoor’s scenes,…