Advertisement
తెలుగు న్యూస్

మా 2021 ఎన్నికల్లో రికార్డు


మా ఎన్నికల్లో ఈ సారి కొత్త రికార్డ్ నమోదైంది. ఇప్పటివరకు మా చరిత్రలో ఇంత స్థాయి పోలింగ్ జరగలేదు. దాదాపు 605 వరకు ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 883 ఓట్లకు ఇన్ని ఓట్లు పడడం ఒక రికార్డు. పోస్టల్ బ్యాలెట్స్ అదనం.

ఆరోపణలు, గొడవల నేపథ్యంలో ఇంత స్థాయి పోలింగ్ జరగడం విశేషం. ఒకదశలో కొందరు నటులు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లారు. ఐతే, ఈ గొడవలను బండ్ల గణేష్ వంటి వారు లైట్ గా తీసుకున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేసిన బండ్ల గణేశ్.. జరిగిన గొడవలపై తనదైన శైలిలో స్పందించాడు. లోపల గొడవ మాత్రమే జరుగుతోందని.. రేపులు, హత్యలు జరగడం లేదన్నారాయన.

బారికేడ్ల మధ్య అలీ బర్త్ డే

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేయడానికి వచ్చిన అలీకి, మీడియా ముఖంగా బారికేడ్ల మధ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు విష్ణు ప్యానెల్ సభ్యులు. స్వయంగా మంచు విష్ణు హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడి విశెష్ చెప్పాడు.

బయటకు రా నీ సంగతి చెబుతా – సమీర్

ఓవైపు ఓటింగ్ జరుగుతుంటే, మరోవైపు నటులు సమీర్, శివబాలాజీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బయట వ్యక్తుల్ని పోలింగ్ కేంద్రంలోకి ఎందురు రానిస్తున్నారని శివబాలాజీ, సమీర్ ను ప్రశ్నించడంతో.. కోపం తెచ్చుకున్న సమీర్.. శివబాలాజీ మీదకు ఉరికాడు. బయటకు రా నీ సంగతి చెబుతానంటూ వార్నింగ్ ఇవ్వడం దగ్గర్లో ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయింది. నన్ను బయకు వెళ్లిపో అని చెప్పడానికి నువ్వెవడవి అంటూ శివబాలాజీ సీరియస్ అయ్యారు.

ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు- మోహన్ బాబు

అందరి సభ్యుల మద్దతు నాకు ఉంది. 880 మంది సభ్యులే నా బలం. ఇదేదో రామరావణ యుద్ధంలా ఉంది. ఇదంతా అనవసరం ఎలాగూ ఇంతదూరం వచ్చాం కాబట్టి చెబుతున్నాను. సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. క్లైమాక్స్ ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది.

Advertisement

This post was last modified on October 10, 2021 3:33 pm

Advertisement
Share