Advertisement
తెలుగు న్యూస్

బిగ్ బాస్ భామ… వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ

రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా జిమ్ లో ఒక భామతో ‘ఎక్సర్ సైజులు’ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాని వెనుకున్న మేటర్ ఏంటో ఈ రోజు బయటపెట్టారు

‘బిగ్ బాస్ తెలుగు’ నాలుగో సీజన్ లో పోటీపడ్డ అరియనా గ్లోరీ అనే బుల్లితెర యాంకర్ తో ఆయన జిమ్ములో కుస్తీ పడ్డారట. ఇదంతా యూట్యూబ్ ఇంటర్వ్యూ కోసమని తాజాగా తేల్చి చెప్పారు వర్మ.

వర్మని అరియనా బోల్డ్ పద్దతిలో ఇంటర్వ్యూ చేసిందట.

ఆమె ఏమి ప్రశ్నలు అడిగిందో, ఈయన ఏమి సమాధానం ఇచ్చారో తెలీదు. అది చూడాలంటే ఈ శుక్రవారం వరకు ఆగాలి. ఐతే, ఈ గ్యాప్ లో ఆమె బొడ్డును చూస్తున్న ఫోటోలను, ఆమెతో కలిసి డంబెల్స్ ఎత్తుతున్న ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా వేదికలపై అప్డేట్ చేస్తున్నారు.

అరియనాని, ఆమె ఇంటర్వ్యూని ఎందుకింత ప్రమోట్ చేస్తున్నారో మరి.

Advertisement

This post was last modified on June 15, 2021 7:23 pm

Advertisement
Share