Advertisement
తెలుగు న్యూస్

అడల్ట్ ఇంటర్వ్యూలతో బిజీ!

రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయారు. అంటే, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు అనుకోవద్దు. అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఇంకో ఒక క్రేజ్ పట్టుకొంది. టీవీ యాంకర్ల తొడలు చూస్తూ వారిని ఇంటర్వ్యూ చేసే కోరిక ఆయనకి కలిగినట్లు కనిపిస్తోంది. వాటికి యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తుండడంతో ఇప్పుడు ఇంటర్వ్యూవియర్ గా మారిపోయారు.

ఇంతకుముందు ‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానాని బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు ఆర్జీవీ. ఈ సారి, ఆసు రెడ్డి వంతు. ఈ టీవీ యాంకర్ ని కూడా బోల్డ్ గా చేశాడట. అదేనండి ఇంటర్వ్యూ.

ఐతే, ఆమెని అప్పుడే ఓ కాఫీ షాప్ లో చూసినట్లు, ఆమె తొడలకు ఫిదా అయిపోయినట్లు ఒక చిన్న డ్రామా కూడా ఆడారు వర్మ. దానికి “ఆమె చెంపదెబ్బ… అమ్మాయి చేతిదెబ్బ” అన్నట్లు ఆమె కూడా ఒక బిల్డప్ ఇచ్చింది.

మొత్తానికి వర్మ సినిమా మేకింగ్ నుంచి అడల్ట్ ఇంటర్వ్యూల మేకింగ్ కి వచ్చారు. వెండితెర కోసం సినిమాలు తీయడం కన్నా యూట్యూబ్ వీడియోలు డైరెక్ట్ చేస్తూ, యాక్ట్ చేస్తూ ఆయన ఆనందం పొందుతున్నారు.

Advertisement

This post was last modified on September 2, 2021 6:30 pm

Advertisement
Share