Advertisement
తెలుగు న్యూస్

రెస్పాన్స్ తో పట్టింపు లేదు!

ప్రపంచం తన గురించి ఏమనుకుంటుంది, పక్కోడు ఏమంటాడో అనే విషయాలని పట్టించుకోని ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన కంపెనీ నుంచి నెలకి రెండో, మూడో సినిమాలు వస్తున్నాయి. ఓటిటిల్లో విడుదలవుతున్నాయి. వాటిని ఎవరైనా చూస్తున్నారా? వాటికి రెస్పాన్స్ వస్తుందా? అన్నది అసలు పట్టించుకోవడం లేదు రామ్ గోపాల్ వర్మ.

సినిమా జయాపజయాలతో సంబంధం లేదు. రిలీజ్ కి ముందు నెల రోజులు తన సోషల్ మీడియా వేదికలపై పోస్టులతో హోరెత్తిస్తారు వర్మ. రిలీజ్ తర్వాత రెండు, మూడు రోజులు దాని గురించే ట్వీటుతారు. అంతే… నెక్స్ట్ వేరే సినిమా గురించి, వేరే వెబ్ సిరీస్ గురించి ప్రచారం.

తాను ‘తీస్తున్న’ సినిమాలకు రివ్యూలు ఎలా వస్తున్నాయి, జనం ఏమనుకుంటున్నారు అనేది ఏ మాత్రం పట్టించుకోరు వర్మ. పని చెయ్యి… ఫలితం గురించి ఆలోచించొద్దు అని శ్రీకృష్ణ భగవానుడు చేసిన గీతోపదేశాన్ని అక్షరాలా పాటిస్తున్న నాస్తిక శిఖామణి మన వర్మ.

ఇప్పుడు లెస్బియన్ మూవీ కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. చూసి మీకు తలనొప్పి వస్తే అది మీ ఖర్మ. అంతే!!

Advertisement

This post was last modified on May 29, 2021 1:19 pm

Advertisement
Share