Advertisement
తెలుగు న్యూస్

ఏజ్, గేజ్ లేదు… ఓన్లీ మజా!


రామ్ గోపాల్ వర్మ వయసు ఒకటి తక్కువ అరవై. కానీ అయన చేష్టలేమో 20లో ఉన్నాడా అని భ్రమపడేలా ఉంటాయి. తాను ట్వంటీస్ లో చెయ్యలేకపోయిన వాటిని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారా అని కూడా అనిపిస్తుంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే… రామ్ గోపాల్ వర్మ ప్రపంచాన్ని మర్చిపోయారు అనిపిస్తుంది. వర్ధమాన నటి ఇనియా సుల్తానాతో కలిసి ‘రంగీలా’ సినిమాలోని “హాయ్ రామా” అనే పాటకి వర్మ డ్యాన్స్ చేశారు. ఇనియా ఊర్మిళలా డ్యాన్స్ చెయ్యగా, వర్మ జాకీ ష్రాఫ్ లా మారి స్టెప్పులు వేశారు. ఈ వీడియోని వర్మ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అది బాగా వైరల్ అయింది. దాంతో పాటు ట్రోలింగ్ కూడా పీక్ కి చేరుకొంది. “వర్మ నీ ఏజ్, గేజ్ మర్చిపోయావా…” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వాళ్లిద్దరూ ఇష్టపడి డ్యాన్స్ చేసుకుంటే… మనం అభ్యంతర పెట్టాల్సింది ఏమి లేదు. కానీ ఆమె నిజంగా ఇష్టంగా డ్యాన్స్ చేసిందా లేక వర్మ అవకాశాలు ఇస్తాడనే ఆశతో అలా చేసిందా అని నెటిజన్లు డౌట్ రైజ్ చేస్తున్నారు.

ఇనియా సుల్తానా ‘బుజ్జి ఇలా రా’ అనే కొత్త సినిమాలో నటిస్తోంది. ఆమె సోషల్ మీడియా అకౌంట్ చూస్తే ఆమె ఇష్టపూర్వకంగానే డ్యాన్స్ చేసినట్లు ఉంది. ఆమె బర్త్ డే పార్టీలో ఈ డ్యాన్స్ హంగామా జరిగిందట. తన జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అంటూ ఆ అమ్మడే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సో… ఆమె ఇష్టపడినప్పుడు జనాలు ఆవేశపడడం అనవసరం. వర్మ ఇలాంటి ట్రొలింగ్ ని పట్టించుకోరు. ఆయన లోకంలో ఆయన ఉంటారు. అదే ఆయనకు మజా.

Advertisement

This post was last modified on August 23, 2021 7:11 pm

Advertisement
Share