Advertisement
తెలుగు న్యూస్

నాగార్జున, ఎన్టీఆర్ రోల్ మార్పిడి

“బిగ్ బాస్” మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ కాన్సెప్ట్ సామాన్య జనాల్లోకి చొచ్చుకుపోయేలా చేశాడు ఎన్టీఆర్ …. తన ఛరిస్మా, హోస్టింగ్ చాతుర్యంతో . కానీ తర్వాతి సీజన్లకి హోస్ట్ గా చేసేందుకు అంగీకరించలేదు. దాంతో రెండో సీజన్ కి నాని, ఆ తర్వాత వరుసగా నాగార్జున హోస్ట్ గా అదరగొడుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అనగానే నాగార్జున అన్నట్లుగా మారింది. అంటే ఎన్టీఆర్ మొదలుపెట్టిన దాన్ని నాగార్జున పూర్తిగా తన షోగా మార్చుకున్నాడు.

ఇప్పుడు నాగార్జున షో మొదలుపెట్టిన షోని ఎన్టీఆర్ టేకప్ చేస్తున్నాడు.

జెమినీ టీవీ లేటెస్ట్ గా “కౌన్ బనేగా కరోడ్పతి” కార్యక్రమాన్ని తెలుగులో ప్రసారం చేసేందుకు అంతా సిద్ధం చేసింది. తెలుగులో ఈ షోని ఇంతకుముందు మాటీవీ “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో కొన్ని సీజన్లు నడిపింది. దానికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించారు. ఇప్పుడు ఇదే షో… జెమినీ టీవీ రివైవ్ చేస్తోంది. హోస్ట్ గా ఎన్టీఆర్ ని ఒప్పించింది.

అంటే నాగార్జున మొదలుపెట్టిన దాన్ని ఎన్టీఆర్ టేకప్ చేస్తున్నాడు. ఇలా ఇద్దరూ రెండు టీవీ షోలని.. పంచుకుంటున్నారు.

Advertisement

This post was last modified on December 12, 2020 9:07 am

Advertisement
Share