Advertisement
తెలుగు న్యూస్

అడ్డగోలు టికెట్ రేట్లు!

తెలంగాణాలో ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు బెంగళూరు మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే అధికంగా ఉన్నాయి. మల్టిప్లెక్స్ లో గరిష్టంగా 295 రూపాయలు. రిక్లైనర్ సీట్లకు 350 రూపాయలు. ఇప్పుడు ప్రభుత్వం “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి మొదటి మూడు రోజులు 50 రూపాయలు, ఆ తరువాత 7 రోజులకు 30 రూపాయలు అదనంగా పెంచింది. రిక్లైనర్ సీట్లకు మొదటి మూడు రోజులు 100, ఆ తర్వాత 7 రోజులకు 50 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

అంటే హైదరాబాద్ లో ఒక మల్టిప్లెక్స్ లో “ఆర్ ఆర్ ఆర్” సినిమా మొదటి వీకెండ్ చూడాలంటే 375 రూపాయలు అవుతుంది ఒక్కో వ్యక్తికి (బుక్ మై షో రేటుతో కలుపుకుంటే). రిక్లైనర్ సీట్లకు దాదాపు 460 రూపాయలు.

“ఆర్ ఆర్ ఆర్ ” సినిమా అధిక బడ్జెట్ తో తీశారని ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో సినిమా వాళ్ళు మరీ రాసుకుపూసుకొని తిరుగుతుండడంతో ‘ప్రజల గురించి’ ఆలోచించకుండా ఇలా అడ్డగోలుగా పెంచేశారు. మరీ ఇలా ఓవర్ గా సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు లాక్కుంటారు కానీ చివరికి ప్రజల్లో బ్యాడ్ నేమ్ వచ్చేది ప్రభుత్వానికే.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించుకోవాలి అని నెటిజన్లు చెప్తున్నారు. అంతే ఈ అడ్డగోలు టికెట్ రేట్లపై విమర్శలు కూడా ఎక్కువ అయ్యాయి.

Advertisement

This post was last modified on March 19, 2022 3:48 pm

Advertisement
Share