Advertisement
తెలుగు న్యూస్

హిందీలో ఇంకా ఊపు రావట్లేదు!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా… ఇలా తెలుగు వారు ఉన్న అన్ని చోట్లా “ఆర్ ఆర్ ఆర్” ఫీవర్ మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్ ల జోరు మామూలుగా లేదు. ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డుల ఖాయం. ట్రెండ్ అలాగే ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.

మరి, రాజమౌళి సినిమా అంటే హిందీలో కూడా అదే జోరు ఉండాలి కదా. ‘బాహుబలి’తోనే కొత్త రికార్డులు సృష్టించిన రాజమౌళి గురించి హిందీ ప్రేక్షకులకు పరిచయం చెయ్యక్కర్లేదు. పైగా సినిమాలో అలియా భట్ ఉంది. హిందీలోనే ఎక్కువ పబ్లిసిటీ చేశారు. తాజాగా ఢిల్లీ ఈవెంట్ కి అమీర్ ఖాన్ ని రప్పించారు. అంతకుముందు ఒక ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ వచ్చారు. ఇంత చేసినా… ఎందుకో అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ల ట్రెండ్ స్లోగా ఉంది. ఇంకా ఊపందుకోలేదు.

బహుశా రేపు, ఎల్లుండి మొదలవ్వొచ్చు. ప్రస్తుతానికి అక్కడ టికెట్ల అమ్మకాల ఊపు సాధారణంగా ఉంది. రిలీజ్ తర్వాత టాక్ వచ్చిందంటే సునామీ కనిపిస్తుంది కాబోలు. ‘బాహుబలి’ మొదటి భాగానికి అలాగే జరిగింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాతో తాము పాన్ ఇండియా స్టార్స్ గా ఎదగాలని కోరుకుంటున్నారు. నమ్మకంగా ఉన్నారు.

Advertisement

This post was last modified on March 21, 2022 1:43 pm

Advertisement
Share