Advertisement
తెలుగు న్యూస్

పెళ్లి మీద అంత ఆసక్తి లేదు

హీరోయిన్ సదా మళ్ళీ వచ్చింది. అదేనండీ ఫిలిం నగర్ కి. ఆమె నటిస్తోంది మరోసారి. ఈ సారి వెబ్ సిరీస్ తో అడుగుపెట్టింది ఈ ‘జయం’ భామ. ఆమెకిప్పుడు 38 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు.

ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే… పెళ్లి ఆలోచన లేదు అని చెప్తోంది. పెళ్లి మీద ఆసక్తి లేకపోవడానికి ఆమె చెప్పిన కారణం కొంత వింతగానే ఉంది. “నను పెళ్లి చేసుకునేవాడు నా సంపాదన మీద ఆధారపడొద్దు,” అని అంటోంది సదా. మరి, అలాంటి వాడినే చేసుకుంటే సరిపోతుంది కదా. భార్య హౌజ్ మేకర్ గా ఉంటే చాలు అనుకునే మగాళ్లే భారతదేశంలో ఎక్కువ. ఆమెకి అలాంటి వాళ్ళు దొరకడం లేదా?

ఆమె చెప్తున్న కారణం సమంజసంగా లేదు. మరేదో కారణం ఉండి ఉంటుంది. అది చెప్పలేక, ఇలా సెలవిస్తున్నట్లు అనిపిస్తోంది.

హీరోయిన్ గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది సదా. ‘జయం’ సినిమాతో పాపులర్ అయి ‘అపరచితడు’ వంటి సంచలన విజయాల్లో నటించిన సదా ఇటీవల నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ ‘హలో వరల్డ్’లో రిఎంట్రీ ఇచ్చింది.

సినిమాల్లో ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు రావు. అలాగని, హీరోలకు తల్లి పాత్రలు పోషించలేను అంటోంది. అందుకే ఆమె వెబ్ సిరీస్ లు బెస్ట్ అనుకుంటోంది.

Advertisement

This post was last modified on August 23, 2022 10:03 am

Advertisement
Share