Advertisement
తెలుగు న్యూస్

ఆదిపురుష్ లో నా పాత్ర అదుర్స్

ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడు పాత్రని పోషిస్తున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఈ సినిమాలో 10 తలల లంకేశుడిగా కనిపిస్తాను అని చెప్తున్నాడు సైఫ్. ఆదిపురుష్ సినిమా గురించి తొలిసారి ఒక పెదవి విప్పాడు సైఫ్.

“రావణుడి పాత్రని కొత్త కోణంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. సీతని రావణుడు అపహరించడం వెనుకున్న కారణాన్ని సహేతుకంగా చూపించనున్నాడు. లంకేశుడు అంటే రాక్షసుడు అనే కోణంలో కాకుండా మానవీయ అంశాలను జోడిస్తున్నాము. రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది ఆదిపురుష్,” అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు సైఫ్. రావణుడి పాత్రని జస్ట్ ఒక విలన్ గా చూడొద్దంటున్నాడు.

ప్రభాస్ రాముడుగా, కృతి సనాన్ సీతగా నటిస్తారు ఈ సినిమాలో. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది.

Advertisement

This post was last modified on December 5, 2020 2:07 pm

Advertisement
Share