Advertisement
తెలుగు న్యూస్

సమంత పై బోలెడు మీమ్స్

స‌మంత‌ మళ్ళీ బిజీగా మారుతోన్న మాట నిజం. నాగ చైతన్య, ఆమె భార్యాభర్తలుగా ఇక కలిసి ఉండబోవడం లేదని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి ఆమె వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆమె ఒక అంతర్జాతీయ చిత్రం సైన్ చెయ్యడం, ఆ సినిమాలో చేస్తున్న పాత్ర ఏంటో తెలియడంతో ట్రోలింగ్ మొదలైంది. మీమ్స్ సృష్టించే వారికి చేతినిండా పని దొరికింది.

‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్’ పేరుతో ‘ఓ బేబీ’ నిర్మాతలు ఒక అంతర్జాతీయ చిత్రం నిర్మిస్తున్నారు. బ్రిటన్ కి చెందిన దర్శకుడు డైరెక్ట్ చెయ్యనున్నారు. ఇందులో సమంత బైసెక్సువల్ (అటు మగవాలతోనూ, ఇటు ఆడవాళ్ళతోనూ లైంగిక సంబంధాలు కలిగి ఉండడం) గా నటిస్తోందన్న వార్త కలకలం రేపింది.

చైతూ విడిపోయింది ఇందుకేనా? అంటూ ట్రోలింగ్ మొదలైంది. మరోవైపు, ఆమె జీవితాన్ని ఆమెని బతకనివ్వండిరా… ఆమెకి నచ్చిన పాత్రలు చేసికోనివ్వండిరా అని మద్దతుగా కూడా మీమ్స్ వస్తున్నాయి.

ఏది ఏమైనా సమంత పాత్రలు, సినిమాల విషయంలో ‘గిరి’ గీసుకోదు. డేరింగ్ గానే వెళ్లనుంది. ఐటెం సాంగ్ లు, బైసెక్సువల్ పాత్రలు ఇలా రెచ్చిపోతోంది అని చెప్పొచ్చు.

Advertisement

This post was last modified on November 27, 2021 1:58 pm

Advertisement
Share