Advertisement
తెలుగు న్యూస్

అక్కడ పబ్లసిటీ చేస్తోన్న సమంత


సమంత చాలా నెలల క్రితమే ముంబైలో ఒక పీఆర్ ఏజెన్సీని హైర్ చేసుకొన్న విషయం తెలిసిందే. తనకి సంబంధించిన వార్తలు ఎక్కువగా పబ్లిష్ అయ్యేలా చూసుకుంటూ వస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రష్మికలకు కూడా ముంబైకి చెందిన పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు సమంత అదే పనిలో ఉన్నారు.

ఇంతకుముందు ఆమె కార్పొరేట్ బ్రాండ్స్ పొందేందుకు నేషనల్ మీడియాలో పబ్లిసిటీ కోరుకునేది. ఎప్పుడైతే, నాగ చైతన్య ఆమె నుంచి విడిపోవాలని నిశ్చయించుకున్నాడో అప్పటి నుంచి ఆమె బాలీవుడ్ మార్కెట్ పై చూపు వేశారు.

ఇప్పటికే ఆమె ఒక హిందీ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. ఐతే, ఆ సినిమాని ఆమె ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం సమంత గురించి ఎక్కువ వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఆమె బాలీవుడ్ మార్కెట్ లో పట్టు సంపాదించేందుకు, అవకాశాలు పొందేందుకు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు.

త్వరలోనే ఆమె మొదటి హిందీ సినిమా ఏది కానుందో తేలనుంది.

Advertisement

This post was last modified on October 25, 2021 10:32 pm

Advertisement
Share