Advertisement
తెలుగు న్యూస్

సమంత మొగ్గు అటువైపే!


సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సూపర్ హిట్ అయింది. దాంతో, ఆమెకి ఓటిటి కంపెనీల నుంచి కళ్ళు చెదిరే ఆఫర్లు వస్తున్న మాట వాస్తవం. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లు కొత్త ప్రొపోజల్స్ తో వచ్చింది కూడా నిజమే. కానీ సమంత మాత్రం ఇంతవరకు మరో వెబ్ సిరీస్ ఒప్పుకోలేదు.​ ​అసలు ఒప్పుకుంటుందా అనేది కూడా డౌటే.

వెబ్ సిరీస్ ల విషయంలో సమంత ఆలోచనలు వేరుగా ఉన్నాయట. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ ఒప్పుకోవడానికి కారణం నటిగా అలాంటి ఛాలెంజింగ్ పాత్ర పోషించాలనుకోవడమే. వెండితెరపై అలాంటివి దక్కడం లేదు. ఆ కోరిక ఈ షోతో నెరవేరింది. అంతే కాదు, 3 కోట్ల పారితోషికం అందుకోవాలన్న అభిలాష కూడా తీరింది. ఏ విధంగా చూసినా ఆమెకి ఈ వెబ్ సిరీస్ తెచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు.

ఐతే, ఇప్పుడు ఆమెకి కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి. అవి కూడా చూసుకోవాలి. ఆ ‘ ప్రియారిటీస్’కి అడ్డు తగలని ఏదైనా మంచి సిరీస్ వస్తే అప్పుడు ఆలోచిస్తుందట. ఇప్పటికిప్పుడు ఆఫర్లు వస్తున్నాయి కదాని ఒప్పుకునే ఆలోచనలో లేదు సమంత. 

అందుకే,​ ​ఆమె కొన్నాళ్ళూ ఇంకో వెబ్ సిరీస్ జోలికి వెళ్లొద్దని అనుకుంటోంది. అదే ఆమె ఆలోచన. దానికి మరో​ ​రీజన్ ఉంది. అదేంటో సరైన టైంలో బయట పెడుతుందట.

Advertisement

This post was last modified on June 16, 2021 7:07 pm

Advertisement
Share