Advertisement
తెలుగు న్యూస్

సమంతవి వెరైటీ కష్టాలు


నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత మళ్ళీ నటిగా బిజీ అయ్యేందుకు చాలా కష్టపడుతోంది. కొన్ని అవకాశాలు అయితే వచ్చాయి. కానీ ఆ సినిమాల వల్ల ఆమెకి ‘హైప్’ వచ్చే అవకాశం లేదు. పెద్ద దర్శకుడి మూవీనే, పెద్ద హీరో చిత్రమో రావాలి. అప్పుడే ఆమె గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు.

ఇపుడు సమంత గురించి డిస్కషన్ ఆగిపోయింది. ఆమె విడాకుల వ్యవహారం ముగిసిన ముచ్చట. జనాలకు ఆసక్తి పోయింది. ఆమె గురించి ట్రెండింగ్ టాఫిక్ ఎదో ఒకటి కావాలి. అందుకే, సమంత ఎవరు పొగిడినా రెస్పాండ్ అవుతోంది. “ఆర్ ఆర్ ఆర్” డ్యాన్స్ సాంగ్ కి కూడా మెంటల్ ఎక్కించేలా ఉందని ట్వీట్ చేసింది.

ఎదో పులిహోర అవార్డుకు కూడా ఓవర్ గా ఎగ్జైట్ అయిపోతోంది. ఇదంతా తన గురించి జనం మాట్లాడుకోవాలనే తాపత్రయం వల్లే. ‘ట్రెండింగ్’లో ఉండాలన్న ఆరాటం వల్లే. గుణశేఖర్ తీసిన ‘శాకుంతలం’ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కావొచ్చు. అప్పటివరకు ఆమెకి తెలుగులో సినిమా లేదు. జనంలో ఆసక్తి రేపే టాఫిక్ లేదు.

ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెడుతున్న కొటేషన్లకు అంతగా విలువ లేదు.

Advertisement

This post was last modified on November 10, 2021 7:38 pm

Advertisement
Share