Advertisement
తెలుగు న్యూస్

సమంత అనారోగ్యం హుష్ కాకి!


సమంత మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడిన మాట వాస్తవం. దాన్నుంచి కోలుకున్న మాటా నిజమే. కానీ, ‘శాకుంతలం’ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు వరుసగా ప్రమోషన్లు చెయ్యడం వల్ల జ్వరం వచ్చింది, మళ్ళీ డీలా పడ్డాను అని ట్వీట్ చేశారు సమంత.

దాంతో, ఎక్కువ స్ట్రైన్ అవకండి అంటూ అభిమానులు ఆమెకి సలహా ఇచ్చారు. కొందరు ఆమె ఆరోగ్య స్థితిని చూసి బాధపడిన ట్వీట్లు కనిపించాయి.

ఐతే, ఇప్పుడు లండన్ లో ఆమె చేస్తున్న హడావిడి చూసి అందరూ అవాక్కు అవుతున్నారు. లండన్ లో ‘సిటాడెల్’ గ్లోబల్ ప్రీమియర్ కోసం సమంత వెళ్ళింది. అక్కడ ఆమె ప్రొమోషన్ ఈవెంట్ లలో, ఆఫ్టర్ పార్టీలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కొన్ని ఫోటోలని ఆమె స్వయంగా షేర్ చేసింది. దాంతో, చాలా మంది ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు. శాకుంతలం కోసం రెండు రోజులు ‘ప్రొమోషన్’ చేస్తేనే వీక్ అయిపోయిన సమంత ఇప్పుడు ఇంత యాక్టివ్ గా ఎలా మారింది అనేది వారి ప్రశ్న.

ఆమె కొన్నాళ్లుగా చెప్తున్నట్లు నిజంగా ‘వీక్’గా ఉందా? లేక సానుభూతి కోసమే ప్రచారమా? ఇలాంటి డౌట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఐతే, ‘శాకుంతలం’ సినిమా విడుదలకు నాలుగు రోజులకు ముందే ప్రీమియర్ షో పడడం, అక్కడ దారుణమైన టాక్ రావడంతో సమంత ప్రమోషన్ లు ఎగ్గొట్టేందుకు ‘జ్వరం’ అనే సాకు చెప్పినట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం ఆమె హెల్తిగానే ఉన్నారు. మయోసిటిస్ నుంచి కోలుకున్నారు.

Advertisement

This post was last modified on April 20, 2023 12:14 pm

Advertisement
Share