Advertisement
తెలుగు న్యూస్

షకీలా బయోపిక్ కి మోక్షం

షకీలా జీవిత చరిత్రని తీస్తున్నామని కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ గతేడాది చాలా హడావిడి చేశాడు. ఆ తర్వాత దాని ఊసే లేదు. ఇక అది అటకెక్కినట్లే అని భావిస్తున్న తరుణంలో ఈ మూవీ విడుదల గురించి మాట్లాడుతోంది టీం. బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా షకీలా పాత్రలో లంకేశ్ సినిమా తీశాడు. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేశాడు.

ఐతే ఆర్థిక సమస్యలు, లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ విడుదలకు నోచుకోలేదు.

“షకీలా” పేరుతోనే రూపొందిన ఈ బయోపిక్ ఈ క్రిస్మస్ కి (డిసెంబర్ 25, 2020) థియేటర్లోకి వస్తుంది అని లేటెస్ట్ గా పోస్టర్ విడుదల చేశారు. ఐతే, అసలు థియేటర్ల వైపు జనం ముఖం చూడని ఈ టైంలో షకీలా సినిమా చూసేందుకు వస్తారా అన్నది చూడాలి. పైగా ఈ సినిమాకి బిజినెస్ కూడా జరగలేదు.

ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగిన షకీలా ఒక సంచలనం. 1990లలో శృంగార చిత్రాల క్వీన్ గా వెలుగొందింది. ముఖ్యంగా మలయాళ చిత్రసీమని దున్నేసింది. ఆమె సూపర్ హిట్స్ మీడియా సూపర్ హిట్స్ డెలివరి చేస్తున్న టైంలో మోహన్ లాల్, మమ్మూట్టి వంటి సూపర్ స్టార్స్ కి పనిలేకుండా పోయింది. ఆ రేంజులో ఆమె హవా నడిచింది అప్పట్లో. ఆమె జీవితంలో చాలా డ్రామా కూడా ఉంది.

Advertisement

This post was last modified on December 2, 2020 10:29 am

Advertisement
Share