Advertisement
తెలుగు న్యూస్

అమెరికాలో శర్వానంద్ హనీమూన్!


ఇటీవలే పెళ్లి చేసుకున్న శర్వానంద్ వరుసగా యాత్రలు చేస్తున్నాడు. పెళ్లికి రెండు రోజులకు ముందు వరకు కూడా సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. పెళ్లి తర్వాత షార్ట్ ట్రిప్ కి వెళ్లి వెంటనే వచ్చి మళ్ళీ అదే షూటింగ్ లో పాల్గొన్నాడు.

అందుకే ఇప్పుడు లాంగ్ హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. శర్వానంద్, ఆయన భార్య ప్రస్తుతం అమెరికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు అని టాక్. షూటింగ్ కి విరామం ఇచ్చి నెల రోజుల హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు శర్వానంద్.

శర్వానంద్ ప్రస్తుతం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్.

గతేడాది ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు ఈ కొత్త సినిమతో భారీ హిట్ కొట్టాలని ప్లాన్స్ వేశాడు.
శర్వానంద్ ఒకప్పుడు వరుసగా హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు రేసులో కొంచెం వెనుకబడ్డాడు.

Advertisement

This post was last modified on July 29, 2023 1:33 am

Advertisement
Share