Advertisement
తెలుగు న్యూస్

శర్వానంద్ ఎలా ప్లాన్ చేస్తాడో?

శర్వానంద్ ఒకేసారి రెండు సినిమాల షూటింగులకు గుమ్మడికాయ కొట్టాడు. కొంత ప్యాచ్ వర్క్ మినహా శర్వానంద్ నటించిన “శ్రీకారం” షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చెయ్యాలా? లేక ఫిబ్రవరిలోనా? అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. మరోవైపు, అతను ఎప్పుడో మొదలు పెట్టిన ఒక తమిళ్ మూవీ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ సినిమా విడుదల కూడా ప్లాన్ చెయ్యాలి.

ఈ రెండు కాకుండా మరో మూవీ (“ఆడాళ్లు మీకు జోహార్లు”) కూడా వచ్చే ఏడాదే విడుదలవుతుంది. అంటే 2021లో మూడు సినిమాలు శర్వానంద్ రిలీజ్ చేస్తాడు. ఐతే, ఏది ఎప్పుడు, ఎంత గ్యాప్లో అన్నది ప్లాన్ చేసుకోవాలి.

శర్వానంద్ రీసెంట్ గా చేసిన అన్ని సినిమాలు ఢమాల్ అనిపించుకున్నాయి. అపజయాలు ఉన్నా… నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. శర్వానంద్ కి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు.

Advertisement

This post was last modified on November 25, 2020 10:52 am

Advertisement
Share