Advertisement
తెలుగు న్యూస్

సోలో లైఫ్ కంటిన్యూ చేస్తుందట


శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నాడు. పోర్న్ చిత్రాల నిర్మాణం, యాప్స్ నిర్వహణ కేసులో రాజ్ కుంద్రా పీకల్లోతు కూరుకుపోయాడు. ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. భర్త అరెస్ట్ తర్వాత షాక్ తిన్న శిల్పాశెట్టి కొన్నాళ్ల పాటు ఇంటిపట్టునే ఉంది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ టీవీషోలలో పాల్గొంటోంది. వాటిద్వారా ఆమెకి మంచి ఆదాయం వస్తోంది. బహుశా అందుకే మళ్ళీ పని చెయ్యడం మొదలుపెట్టింది.

భర్త జైలు నుంచి వచ్చినా… ఆయనకి దూరంగా ఉండాలని శిల్ప నిర్ణయించుకొందని బాలీవుడ్ మీడియా కథనం. శిల్పాశెట్టి ఇక ఒంటరి జీవితాన్ని లీడ్ చెయ్యాలని భావిస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంతో చెప్పలేం. కానీ, భర్త అరెస్ట్ వల్ల జరిగిన తనకి వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు శిల్పాశెట్టి ప్రయత్నిస్తోంది. ఆమె పరువు గంగలో కలిసింది.

14 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే “హంగామా 2” అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. “నికమ్మ” అనే మరో సినిమా సెట్స్ పై ఉంది. ఇకపై మరిన్ని సినిమాలు చేస్తూ… నటిగా మరోసారి బిజీ కావాలనుకుంటోంది.

శిల్పాశెట్టికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. 46 ఏళ్ల శిల్ప మళ్ళీ సినిమాల్లో నటించి డబ్బు సంపాదించాలనుకుంటోంది. సినిమా ఇండస్ట్రీలోని ఆమె మిత్రులు అండగా నిలిచేందుకు అంగీకరించారట. ఆమెకి మంచి పాత్రలు ఇస్తామని ప్రామిస్ చేశారట.

Advertisement

This post was last modified on August 31, 2021 2:41 pm

Advertisement
Share