Advertisement
తెలుగు న్యూస్

సితార ఎంట్రీ వార్త అబద్దమే

మహేష్ బాబు కూతురు సితార చాలా యాక్టివ్. ఇప్పటికే ఆమె యూట్యూబ్ వీడియోలు చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో పాపులారిటీ ఉంది. సితార పాపా అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఈ ఎనిమిదేళ్ల చిన్నారి తల్లితండ్రుల బాటలోనే అడుగులు వేస్తున్నట్లు టాక్. బాలనటిగా రంగప్రవేశం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

మహేష్ బాబు కుటుంబంతో అనుబంధం ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా సినిమా తీయనున్నారు. దిల్ రాజ్ నిర్మించే ఈ మూవీలో ఒక చిన్నారి పాత్ర కోసం సీతారని తీసుకున్నట్లు న్యూస్ వచ్చింది. కానీ అది ఉత్తిత్తి వార్తే అని తేలింది.

వంశీ పైడిపల్లి ఇంతవరకు అలాంటి ఆలోచనే చేయలేదట.

మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పటికే బాలనటుడిగా పరిచయం అయ్యాడు. ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించాడు గౌతమ్. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఇక హీరోగానే ఎంట్రీ ఇస్తాడేమో.

Advertisement

This post was last modified on October 6, 2021 7:08 pm

Advertisement
Share