Advertisement
తెలుగు న్యూస్

దుబాయిలో నాగ్ తో ఫైట్లు


సోనాల్ చౌహన్ అంటే గ్లామర్ కి మారుపేరు. కానీ, ఒక కొత్త తెలుగుసినిమాలో అందచందాల ప్రదర్శనతో పాటు ఫైట్లు కూడా చేస్తుందట. నాగార్జున సరసన ఆమె నటించనుంది.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాగార్జున హీరోగా, కాజల్ హీరోయిన్ గా ‘ది ఘోస్ట్’ అనే సినిమా గతేడాది మొదలుపెట్టారు. కాకపోతే, కాజల్ గర్భవతి కావడంతో ఆమె సినిమా నుంచి తప్పుకొంది. దాంతో, నాగార్జున ఈ సినిమాని పక్కన పెట్టి ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ మొదలుపెట్టి పూర్తి చేసేశారు.

ఈ గ్యాప్ లో దర్శకుడు పలువురు హీరోయిన్లను సంప్రదించారు కానీ వర్కౌట్ కాలేదు. చివరికి సోనాల్ చౌహన్ ఒప్పుకొంది. అవకాశాలు లేని సోనాల్ వెంటనే ఒప్పుకొంది. ఆమె యాక్షన్ కైనా, గ్లామర్ షోకైనా రెడీ.

ఇక ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. దుబాయ్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. నాగార్జున, సోనాల్, మరికొందరు ఫైటర్స్ ఈ షూట్ లో పాల్గొంటారు.

Advertisement

This post was last modified on January 29, 2022 2:22 pm

Advertisement
Share