Advertisement
తెలుగు న్యూస్

శిల్పాశెట్టి స్థానంలో సోనాలి బెంద్రే


భర్త రాజ్ కుంద్రే అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి బయటకు అడుగుపెట్టడం లేదు. ఆమె చేస్తున్న టీవీషోలలో ఆమె స్థానంలో ఇతర స్టార్స్ దర్శనమిస్తున్నారు. తాజాగా ఆమె చాలాకాలంగా చేస్తోన్న “సూపర్ డ్యాన్సర్ 4″లో సోనాలి బెంద్రే గెస్ట్ గా విచ్చేశారు. అంతకుముందు వారం కరిష్మా కపూర్ కనిపించారు.

శిల్పాశెట్టి తిరిగి షోకి వచ్చేంతవరకు లేదా ఆమె పూర్తిగా తప్పుకునేంతవరకు ఇలా గెస్ట్ తారలతో కార్యక్రమాన్ని నడిపిస్తారట. ఆమెకి దాదాపు రెండు కోట్ల రూపాయల ఆదాయం హుష్ కాకి.

మరోవైపు, సోనాలి బెంద్రే ఇప్పుడు మరింత స్లిమ్ గా కనిపిస్తున్నారు. ఆమె కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ కి గురయ్యారు. అమెరికాలో ఆమెకి చికిత్స జరిగింది. ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. అంతేకాదు, 46 ఏళ్ల సోనాలి ఇప్పుడు 20 ఏళ్ల ఏజ్ ఫిజిక్ తో అదరగొడుతున్నారు. ఆమె ఈ ‘సూపర్ డ్యాన్సర్ 4’ షోకి ఒక డిజైనర్ జాకెట్ వేసుకొని వచ్చారు. అది 20 ఏళ్ల క్రితం కొన్నదట. ఆ విషయాన్నీ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

అప్పటి డ్రెస్ ఇప్పుడు కూడా ఆమెకి సరిపోయిందంటే ఎంత స్లిమ్ గా మారిపోయారో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

This post was last modified on August 7, 2021 8:54 am

Advertisement
Share