Advertisement
తెలుగు న్యూస్

తెలంగాణ రెండో హోమ్: సోనుసూద్

తనకి తెలంగాణ రెండో సొంత రాష్ట్రం అని అంటున్నారు సోను సూద్. మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో నివాసం ఉండే సోను సూద్ తనకి ఎక్కువ పని కల్పించింది తెలుగు చిత్రసీమ అని తెలిపారు. “అందుకే ఎక్కువగా హైదరాబాద్ లోనే వర్క్ చేశా. తెలంగాణ రెండో సొంత రాష్ట్రంలాంటింది,” అని సోను సూద్ ట్వీట్ చేశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్… సోను సూద్ ని రియల్ హీరోగా అభివర్ణించారు. దానికి రిప్లై ఇచ్చారు సోను. ఏడేళ్లలో తెలంగాణాని గణనీయంగా అభివృద్ధి చేసిన కేటీఆర్ నాకు నిజమైన హీరో అని అన్నారు సోను సూద్.

దేశమంతా ఇప్పుడు సోను సూద్ పేరు మార్మోగుతోంది. ఈ కరోనా కష్టకాలంలో సాయం అడిగిన ప్రతివారికి తన వంతు హెల్ప్ అందించారు ఆయన. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతున్నారు.

Advertisement

This post was last modified on June 1, 2021 7:08 pm

Advertisement
Share