Advertisement
తెలుగు న్యూస్

ఎట్టకేలకు అట్లీ సినిమా ఖరారు

రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్… అన్ని హిట్ చిత్రాలే. అందుకే, యువ తమిళ దర్శకుడు అట్లీకి తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చింది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ కి అట్లీ అంటే వెర్రి అభిమానం. అలా ఎంతో క్రేజున్న దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ లో నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ‘విజిల్’ హిట్ కాగానే బాలీవుడ్ అగ్ర హీరో షారూక్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది. ఎగిరి గంతేసి కమిట్ అయ్యాడు అట్లీ.

ఆ తర్వాత కరోనా రావడం, లాక్డౌన్ కొనసాగడంతో ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది. అలాగే, అట్లీ చెప్పిన సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో దాన్ని మార్చమని చెప్పి షారూక్.. ‘పఠాన్’ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. తాజాగా మొత్తం స్క్రిప్ట్ మళ్ళీ నేరేట్ చేశాడట అట్లీ. షారుక్ ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బాలీవుడ్ వెబ్ సైట్స్ తాజాగా రాస్తున్నాయి.

ఐతే, ఇప్పుడు కరోనా వేవ్ తగ్గి… ‘పఠాన్’ షూటింగ్ ముగిసిన తర్వాత అట్లీ మొదలు పెట్టగలడు. అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది షూటింగ్. ఓ మూడేళ్ళ కాలం ఈ దర్శకుడు నుంచి మాయం అయ్యాయి.

Advertisement

This post was last modified on May 25, 2021 10:06 pm

Advertisement
Share