Advertisement
తెలుగు న్యూస్

సుధీర్ బాబు ‘విప్పడం’ మానేస్తాడా?

“శ్రీదేవి సోడా సెంటర్” ప్రమోషన్ లో భాగంగా మీడియాను ఓ కోరిక కోరాడు హీరో సుధీర్ బాబు. తన బాడీ కంటే నటన గురించి మాట్లాడమని అడిగాడు. నిజంగానే సుధీర్ బాబు కోరుకున్నది జరిగింది. శ్రీదేవి సోడా సెంటర్ రిలీజైన తర్వాత అతడి బాడీ కంటే నటన గురించే ఎక్కువమంది మాట్లాడుకున్నారు. ఈ సినిమా దారుణంగా పరాజయం పాలు అయింది. సుధీర్ బాబు ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. ఐతే, గుడ్డిలో మెల్ల అతని నటనకి మార్కులు పడ్డాయి.

అయితే సుధీర్ బాబు ”విప్పుడు యవ్వారం”పై కామెంట్స్ కూడా పడుతూనే ఉన్నాయి. సినిమా ఆసాంతం బట్టలు విప్పి బాడీ గురించి మాట్లాడొద్దంటే ఎలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. కనీసం రాబోయే సినిమాల్లోనైనా విప్పడం మానేస్తే, నటన గురించి మరింతగా మాట్లాడుకునే అవకాశం వస్తుందని సలహా ఇస్తున్నారు.

నెటిజన్ల కామెంట్లలో వాస్తవం ఉంది. కొన్ని రివ్యూస్ లో కూడా ఇదే కామెంట్ వినిపించింది.

కోస్తా బ్యాక్ డ్రాప్ లో బిలో-మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్ర పోషిస్తూ.. సిక్స్ ప్యాక్ బాడీ చూపించడం కరెక్ట్ కాదంటూ విమర్శలొచ్చాయి. టాలీవుడ్ బెస్ట్ బాడీస్ లో సుధీర్ బాబు కూడా ఒకడు. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం లేదు. కానీ కథతో, పాత్రతో సంబంధం లేకుండా బాడీ చూపించేందుకు తహతహలాడితే మాత్రం ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

This post was last modified on August 30, 2021 11:06 pm

Advertisement
Share