Advertisement
తెలుగు న్యూస్

హైదరాబాద్లో రజిని, కీర్తి

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంతకుముందు ఒప్పుకున్న సినిమా పూర్తి చేస్తాడా? లేదా వదిలేస్తాడా? అని తెలుగుసినిమా.కామ్ ఇంతకుముందు డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. దానికి సమాధానం దొరికింది. పూర్తి చెయ్యాలనే నిర్ణయించుకున్నాడు. రజినీకాంత్, కీర్తి, నయనతార నటిస్తోన్న “అన్నత్తే” (అన్నయ్య అని అర్థం) అనే సినిమా సగమే పూర్తి అయింది ఇప్పటివరకు. నెల రోజుల గ్యాప్ లో మొత్తం కంప్లీట్ చెయ్యాలని రజిని ఫిక్స్ అయ్యాడు. ఈ వీకెండ్ హైదరాబాద్ వస్తున్నాడు సూపర్ స్టార్.

రామోజీ ఫిలిం సిటీలో లాంగ్ షెడ్యుల్ జరుగుతుంది. దాంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుంది. కీర్తి సురేష్ కూడా హైదరాబాద్ కి వచ్చేసింది. ఈ సినిమాలో మీనా, ఖుష్బూ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి శివ దర్శకుడు. ఈయన ఇంతకుముందు తెలుగులో గోపీచంద్ హీరోగా “శంఖం”, “శౌర్యం” వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తమిళంలో అగ్ర దర్శకుడిగా నిలిచాడు.

ఈ షూటింగ్ పూర్తి కాగానే రజినీకాంత్… తమిళనాడు అంతా పర్యటిస్తాడట. ఆయన పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది.

ఒకవేళ, ఆయన పార్టీ గెలిస్తే… ఈ సినిమానే రజినీకాంత్ చివరి సినిమా అవుతుంది. ఒకవేళ ఆయన సీఎం అయినా, లేదా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నా.. నటనకు గుడ్ బై చెప్పాల్సి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవిలా లేదా పవన్ కళ్యాణ్ లా ఓడిపోతే… తిరిగి సినిమాల్లో నటిస్తాడు.

Advertisement

This post was last modified on December 10, 2020 12:56 pm

Advertisement
Share