Advertisement
తెలుగు న్యూస్

ఆయన మగతనంతో నాకేంటి పని?

“ఆయన మగతనంతో నాకేంటి పని… ఆయన, ఆయన భార్య చూసుకోవాలి…” అంటూ నటి సురేఖ వాణి చేసిన ఒక వీడియో మంచి లైకులు తెచ్చుకుంటోంది. సురేఖ వాణి ఇప్పుడు ఎక్కువగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమెకి సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ వచ్చింది ఫోటోలు, ఈ రీల్స్ వల్లే.

తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన రాజకీయ పాదయాత్రలో భాగంగా ఇటీవల ఓ అధికార పార్టీ నాయకుడిపై విమర్శలు గుప్పించారు. ఆయనకి మగతనం లేదన్నట్లుగా మాట్లాడారు. అది వివాదం కావడంతో ఆమె అలా తాను అనలేదని బుకాయించారు. ఆ సందర్భంగా షర్మిల చెప్పిన మాటలు ఇప్పుడు రీల్స్ కి ముడి సరుకు అయింది.

షర్మిల ని బాడీ లాంగ్వేజ్ ని అనుకరిస్తూ సురేఖ ఒక రీల్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది.

40 ప్లస్ ఏజ్ లో సురేఖ వాణి ఇప్పుడు తల్లి పాత్రలు పోషిస్తున్నారు. కానీ, ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె లెక్క వేరు.

Advertisement

This post was last modified on March 25, 2023 7:35 pm

Advertisement
Share