Advertisement
తెలుగు న్యూస్

సూర్య ‘జైభీం’ డైరెక్ట్ ఓటిటిలోకి


తమిళ అగ్ర హీరో సూర్య గతేడాది ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదల చేశారు. దానికి మంచి పేరు వచ్చింది. అమెజాన్ కి కూడా సబ్ స్క్రైబర్లు, వ్యూయర్ షిప్ పెరిగింది. దాంతో, సూర్యతో అమెజాన్ నాలుగు చిత్రాల డీల్ కుదుర్చుకొంది. ఇటీవలే సూర్య ‘జైభీం’ అనే ఒక సినిమాని ప్రకటించారు. ఆ మూవీ డైరెక్ట్ గా అమెజాన్ లో రిలీజ్ కానుంది.

అలాగే, సూర్య నిర్మిస్తున్న మరో మూడు చిన్న చిత్రాలు కూడా అమెజాన్ లో విడుదల అవుతాయి. ఈ నాలుగు చిత్రాలు థియేటర్ లలోకి రావు.

మొత్తమ్మీద సూర్య ఇప్పుడు మంచి సంపాదన మొదలుపెట్టాడు. మొదట్లో తన బ్యానర్ పై తీసిన సినిమాలు పరాజయం పాలు అయ్యాయి. కానీ ఇప్పుడు ఒటిటి పుణ్యమా అని అన్ని వాటికి అమ్మేస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్ల గొడవ లేదు, నష్టాల సమస్య లేదు. హిట్ ఫ్లాప్ ముచ్చట అస్సలే రాదు. తన బ్రాండ్ ఇమేజ్ తో అమెజాన్ కి సినిమాలు అమ్మేసి మంచి లాభాలు పొందుతున్నాడు.

సూర్య నిర్ణయాన్ని మొదట తమిళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఏమి చెయ్యలేక మౌనంగా ఉన్నారు. సూర్య ఈ కరోనా కాలాన్ని తన వ్యాపారానికి అనుకూలంగా ఉపయోగించుకున్నారు.

Advertisement

This post was last modified on August 5, 2021 1:42 pm

Advertisement
Share