Advertisement
తెలుగు న్యూస్

‘ఇచట’ నా బెస్ట్ వర్క్: సుశాంత్

సుశాంత్ హీరోగా న‌టించిన ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుది. రిలీజ్ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు సుశాంత్.

  • సొంతంగా నిర్ణయాలు తీసుకో అని చెప్పారు మావయ్య నాగార్జున. నచ్చిన సినిమాను చేస్తే ఆ రిజల్ట్ తెర మీద కనిపిస్తుందని అనుకున్నాను. అందుకే “చిలసౌ” నుంచి ఎక్కువ ఒత్తిడి తీసుకోలేదు. “చిలసౌ”, “అల వైకుంఠపురంలో” విషయాల్లో నా నిర్ణయాలు కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ విషయంలో కూడా కథని బలంగా నమ్మి చేశాను.
  • “చిలసౌ” విడుదలకి ఓ రెండు నెలల ముందే ఈ కథను డైరెక్టర్ దర్శన్ వినిపించారు. “అల వైకుంఠపురములో” వల్ల లేట్ అయింది. ఈ కథ నాకు బాగా నచ్చింది.
  • ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ రియలిస్టిక్ గా ఉంటుంది. ఎంటర్టైనింగ్‌గానూ ఉంటుంది. కమర్షియల్ టచ్ మిస్ అవలేదు. ఇంత వరకు ఏ సినిమాలోనూ అలా చేయలేదు. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడని చూసిన వాళ్ళు అన్నారు. విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో ఇదే బెస్ట్ వర్క్. ఈ సినిమాను దాదాపు 50 మందికి చూపించాం. అందరూ బాగానే ఉందని అన్నారు. డిజిటల్ ఆఫర్ ఇచ్చిన వారు కూడా సినిమాను చూసే తీసుకున్నారు. కొన్ని సీన్స్ గుర్తుండిపోయాయని అందరూ అన్నారు. మా వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ఇక జనాలు తీర్పు ఇవ్వాలి.
  • హీరోయిన్ మీనాక్షి చౌదరి మిస్ ఇండియా అని నాకు తెలీదు.ఒక వర్క్ షాప్ లో కలిశాం. ఆ క్లాస్‌లో ఓ టఫ్ సీన్ చేశారు ఆమె. తెలుగు సినిమాలో చాన్స్ వస్తే చేస్తారా? అని అడిగాను. అలా మీనాక్షి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. మా సినిమా విడుదల కాకముందే రవితేజ సరసన ‘ఖిలాడీ’, తమిళంలో కొన్ని సినిమాల్లో వచ్చాయి ఆమెకి.
  • “అల వైకుంఠపురములో సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల ఈ మూవీ లేట్ అయింది. అల వైకుంఠపురములో, ఇచ్చట వాహనములు రెండు కూడా ఒకే సంవత్సరంలో వస్తాయని అనుకున్నాను. కానీ పాండమిక్ వల్ల అది మిస్ అయింది. ఇకపై స్పీడ్ గా చేస్తాను.
  • లాక్ డౌన్ లో పియానో నేర్చుకున్నాను. వంట చెయ్యడం కూడా వచ్చింది.

  • “అల వైకుంఠపురములో” నాకు బాగా హెల్ప్ అయింది. ఓటిటి వల్ల దేశమంతా చూశారు. అలాగే, షూటింగ్ సమయంలో త్రివిక్రమ్, బన్నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను.

  • పెళ్లి గురించి ఏం ప్లాన్ చేయలేదు. కాబోయే భార్య ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే ఆలోచనలు కూడా లేవు.
Advertisement

This post was last modified on August 26, 2021 5:07 pm

Advertisement
Share