Advertisement
తెలుగు న్యూస్

కార్తికేయ స్వీట్ గై: తాన్యా

‘రాజా విక్రమార్క’ సినిమాలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటించింది. ఆమెకి ఇది మొదటి తెలుగు మూవీ. ఆమె తాతయ్య రవిచంద్రన్ ఒకప్పుడు ఫేమస్ యాక్టర్. మీడియాతో తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?

పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. ‘ముందు పీజీ పూర్తి చెయ్. తర్వాత సినిమాలు చేయొచ్చు’ అని మా పేరెంట్స్ చెప్పారు. ఒక్క సినిమా చేస్తానని చెప్పను. అయితే… వరుస అవకాశాలు రావడంతో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక… పీజీ కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.

‘రాజా విక్రమార్క’లో అవకాశం ఎలా వచ్చింది?

దర్శకుడు శ్రీ సరిపల్లి ముందు ఫోన్ చేశారు. తర్వాత చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఓకే చేశా. నా పాత్ర పేరు కాంతి. ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంది. అలాగే, తను భరతనాట్యం డాన్సర్. నేను గత పదిహేనేళ్లుగా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ… కాంతి చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో లక్షణాలు నచ్చాయి.

కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్…

హీ ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. అతని నటన చాలా నేచురల్ గా ఉంటుంది. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ బావుంది.

తెలుగు మాట్లాడుతున్నారా?

ప్రస్తుతం నేర్చుకుంటున్నాను. నాకు తెలుగు అర్థం అవుతుంది. కానీ, వెంటనే తిరిగి మాట్లాడలేను.

సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ రవిచంద్రన్ ఏమన్నారు?

దురదృష్టవశాత్తూ… నేను సినిమాల్లోకి వస్తానని ఆయనకు తెలియకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చిన్నతనం నుంచి నాకు సినిమాలు అంటే ఆసక్తి. కానీ, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండటం తాతయ్యకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు తాతయ్య ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని

Advertisement

This post was last modified on November 5, 2021 7:47 pm

Advertisement
Share