Advertisement

కొన్నాళ్ల క్రితం వరకు ఐటెం గర్ల్స్ అంటూ ప్రత్యేకంగా ఉండేవారు. పలువురు భామలు ఐటెం గర్ల్స్ గా కెరీర్ ని తీర్చిద్దుకున్నారు. బాగా సంపాదించారు. ఐతే, వారికి హీరోయిన్లకు ఇచ్చే పారితోషికంలో ముప్పావు వంతు కూడా ఇచ్చేవారు కాదు నిర్మాతలు.

కానీ, కాలం మారింది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లతోనే ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు. దాంతో, నిర్మాతలు కోట్లలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

ఇటీవలి కాలంలో ఐటెంబాంబ్ గా పేరొందిన హీరోయిన్ ఊర్వశి రౌటేలా. ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో మాత్రం ఐటెం సాంగ్స్ మాత్రమే చేస్తోంది. ఈ భామకి కోటి తీసుకుంటోంది కేవలం ఒక పాటలో డ్యాన్స్ చేస్తున్నందుకు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్ట్లీ ఐటెం గర్ల్ ఈ భామనే.

తెలుగులో ఈ భామ ఇప్పటివరకు “బ్లాక్ రోజ్” (ఇంకా విడుదల కావాల్సి ఉంది), “వాల్తేర్ వీరయ్య”, “ఏజెంట్”, “బ్రో” చిత్రాల్లో డ్యాన్సులు చేసింది. “బ్రో” సినిమాకి ఏకంగా కోటి రూపాయలు తీసుకుందట.

Advertisement

This post was last modified on July 11, 2023 7:58 pm

Advertisement
Share