Advertisement
తెలుగు న్యూస్

ఇంకా గాళ్ ఫ్రెండ్ సెట్ కాలేదు!


యువ హీరో వైష్ణవ్ తేజ్ కి ఇంకా గాళ్ ఫ్రెండ్ సెట్ కాలేదంట. ‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవ్ కి ఫిమేల్ ఫాలోయింగ్ పెరిగింది. ఐతే, తనకి నిజజీవితంలో గాళ్ ఫ్రెండ్ ఎవరూ లేరని అంటున్నాడు.

డేటింగ్ చేసే ఉద్దేశంలో లేడంట. కెరియర్, సినిమాలపైనే ఫోకస్.

ఇటీవల అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేశాడు వైష్ణవ్ తేజ్. అనేక విషయాలు బయటపెట్టాడు. అందరూ భావిస్తున్నట్లు తన అభిమాన హీరో తన మామయ్య చిరంజీవి కాదంట. సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే పిచ్చ లైకింగ్ అంట.

వైష్ణవ్ రెండో సినిమాని క్రిష్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల అవుతుంది. మూడో సినిమా గిరీశయ్య అనే తమిళ్ దర్శకుడు తీసే మూవీ.

Advertisement

This post was last modified on June 11, 2021 5:12 pm

Advertisement
Share